Saturday, May 17, 2014

శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతులు దివ్యానుభూతి స్రవంతులు

http://www.youtube.com/watch?v=luDr7tRWIGQ&feature=share


                                                        ఓం  శ్రీ రామ

 . త్యాగరాజ కీర్తనలు భక్తి జ్ఞాన వైరాగ్య తత్వాల సారాంశా లు రామ  భక్తి  సామ్రాజ్య సౌఖ్య సముపార్జనకి సొపానాలు. ఆ తీయని పలుకులు రసగుళికలు .  త్యాగరాజు  తమ  కీర్తనల ద్వారా  మనకుమన జీవితం లోని ప్రతి సందర్భం లోను  సందేశం,సహాయం,సానుభూతిని అందిస్తూ మనకు అండగా  వుండి కాపాడుతూ ఉంటారు.  మానవ  జాతి ఉద్ధరణ కి ఆయన కీర్తనలు ఎంతో ఉపకరిస్తాయనడం లో సందేహం లెదు. అది భౌతిక ,అది దైవిక బాధలని అధిగమించే ఆత్మ  శక్తిని ,నిర్మలమైన ఆనందవర్ధకమైన ప్రవృత్తినీ సాధారణ సంసారులు అలవోకగా అలవరచుకునే మార్గం  త్యాగరాజ కృతులని తరచూ వినడము ,పాడుకోవడమే!
                    త్యాగరాజ కృతులని విన్నా ,పాడినా రామాయణ పారాయణ ఫలం లభిస్తుంది .పిల్లలకి త్యాగరాజ కృతులు వినిపిస్తే మనోవికాసం కలుగుతుంది . అంతే  కాదు భక్తి , శ్రద్ధలతో త్యాగరాజ కీర్తనలని విన్నవారిలో నిద్రాణమైన దైవాంశ  చిగురిస్తుంది ముఖంలో కాంతి , మనసులో శాంతి ప్రభవిస్తుంది .ఇదే నాదామృత యోగ సిద్ధికి నాంది . జాతి ,కుల , మత ,దేశ  వయో బేధాలకి  అతీతమైన యోగ శక్తి  త్యాగరాజ కృతులలో ఇమిడి ఉన్ది. దివ్యమైన శబ్ద,రాగ,లయబద్ధమై ఎన్నో శారీరిక ,మానసిక రుగ్మతలని నివృత్తి చేయగల శక్తి త్యాగరాజ కీర్తనలలో ఉంది.అంటే music therapy అన్నమాట . ఆయన కీర్తనలు ఎన్ని మార్లు విన్నా నవ్యాతి  నవ్యం ,తనివి తీరని మాధుర్యం  . మనసుని శాంతింప చేసి ,ఆనంద డోలికలనూగించి ,జీవితం ధన్యం అనిపించేటట్టు చిత్త  శుద్ధిని కలుగ చేసే శక్తి త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని అమృత ధార .ఇది గ్రోలని జన్మ వృధా .దయ చేసి ఆయన కీర్తలని పాడండి! వినండి
   అయన కీర్తనలు పాడినా ,విన్నా ఆ పవిత్ర గాన మాధురి ప్రజా బాహుళ్యానికి పంచిపెట్టే నాద యజ్ఞం లో ఏ విధమైన పాత్ర వహించినా పుణ్య జీవులమయ్యే సదవకాశం మనకి కలుగుతుంది