Sunday, November 27, 2011

త్యాగరాజ ఆత్మ దర్సనం-ఒక కొత్త ప్రయోగం


మన సంగీత సంప్రదాయం చాలా విశిష్టమైనది.కాని మనసంప్రదాయ సంగీతం అందులోనూ దక్షిణాది సంగీతం వినాలన్నా,పాడాలన్నా కనీస సంగీత పరిజ్ఞానం అవసరం.అందువల్లే మన శాస్త్రీయ సంగీతం పండితులకే పరిమితమైపోయింది.శాస్త్రీయ సంగీతం అంటే అదేదో అంతర్రని వస్తువులా చాలా మంది అభిప్రాయ పడుతుంటారు.ఇది కేవలం ఒక అప్పోహ మాత్రమే!ఈ అపోహవల్లె నేటి యువతరం పాస్చ్యాత సంగీతం పట్ల చూపుతున్న ఆసక్తిని మన సంగీతం పట్ల చూపడం లేదు.దేఎనివల్ల మన సంప్రదాయ సంగీతం భావి తరాల వారికి అందే అవకాశం మృగ్యం అయిపోతోంది.
నేను need of the time ని గుర్తించి ,మన శాస్త్రీయ సంగీతం అన్దరూ వినాలి,పాడుకొవాలనే లక్ష్యం తో ,ముఖ్యంగా నేటి యువత వినాలి,పాడాలి ,భావి తరాల వారికి మనసంప్రదాయ సంగీతాన్ని అందించాలని,అందుకు అనువుగా మనసంప్రదాయ సంగీతాన్ని మలచి సమర్పించాలనిధృడంగా సనకల్పించాను.
సాహిత్య భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రచన యొక్క ఆత్మ( పవిత్రత)ని కాపాడుతూ ,స్టాండర్డ్స్ దిగజారకుండా అవసరమైన సందర్భంలో తాళం ,రాగం మార్చి అన్దరూ మెచ్చే విధంగా కీర్తనలని సమర్పిస్తున్నాను.
మీకు నా ప్రయోగం తప్పకుండా నచ్చుతుందని విశ్వసిస్తున్నాను .
ప్రఖ్యాత చలన చిత్ర దర్శకులు కే. విశ్వనాద్ గారితో నా ఈ కాన్సెప్ట్ గురించి సోదాహరణంగా ముచ్చటిస్తే ఆయన ఈ నా కాన్సెప్ట్ ని మెచ్చుకుంటూ ఈ కాన్సెప్ట్ కి `త్యాగ రాజ ఆత్మ దర్శనం'అని నామకరణం చేసారు.


ఈ కాన్సెప్ట్ కి ఒక ఉదాహరణ గా త్యాగరాజకీర్తన `మోక్షముగలదా 'కీర్తన హిందూస్థానీ రాగం `యమన్'(కల్యాణి) లో  ను ,నగుమోము  కీర్తనని `కేదార్ ' రాగం  లోనూ స్వర బద్ధం చేసి మీకు వినిపిస్తున్నాను.ఇది కేవలం దైవ ప్రేరణే అని నేను  సంపూర్ణం గా విశ్వసిస్తున్నాను .